పార్థసారథి పదవీ విరమణ
తెలంగాణ రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధనా సంస్థ (ఈపీటీఆర్ఐ) డైరెక్టర్ జనరల్, సీనియర్ ఐఏఎస్ అధికారి సి.పార్థసారథి గురువారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయానికి వెళ్లి ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్‌ను కలిశారు. పార్థసారథిని సీఎస్ మెమొంటోతో సత్కరించారు. ఉమ్మడి ఏపీలోని ఆచార్య ఎన్జీ రంగా వ్వవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్సీ చదివిన ఆయన.. ఐఏఎస్ అధికారిగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఆదిలాబాద్ డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా, కరీంనగర్ కలెక్టర్‌గా, పౌరసరఫరాలు, వ్యవసాయశాఖ, విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌గా సేవలందించారు. తెలంగాణ విశ్వవిద్యాలయం, ఉద్యాన వర్సిటీలకు ఇంఛార్జి ఉపకులపతిగా, ఐదేళ్లపాటు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. రైతుబంధు, రైతుభీమా తదితర పథకాల రూపకల్పన, అమలులో కీలక పాత్ర పోషించారు.













