వ్యాక్సినేషన్ లో ప్రవాస భారతీయులకు… ప్రాధాన్యమివ్వండి

కరోనా వ్యాక్సినేషన్ పక్రియ ముమ్మరమైన నేపథ్యంలో ప్రవాస భారతీయులకు ప్రాధాన్యమిచ్చి వారికి ముందుగా వ్యాక్సినేషన్‍ను పూర్తిగా చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్‍కు ఆయన లేఖ రాశారు. విదేశాలలో స్థిరపడ్డ వారు, ఉద్యోగ, ఉపాధి కోసం విదేశాలలో ఉంటున్న వారు చాలా మంది స్వస్థలాలకు వచ్చారని, వారంతా కరోనా కారణంగా కొంత కాలంగా ఇక్కడే ఉంటున్నారన్నారు. ఇప్పుడు వారు విదేశాలకు వెళ్ళాలంటే టీకా తప్పనిసరి నిబంధనను చాలా దేశాలు విధించాయన్నారు. చాలా మంది టీకా వేసుకోని కారణంగా విదేశాలకు వెళ్ళలేకపోతున్నారన్నారు. వీరి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎన్‍ఆర్‍ఐలకు ప్రాధాన్యక్రమంలో టీకా వేయించే కార్యక్రమాన్ని చేపట్టాని కోరారు.