ఆ నలుగురు సెకండ్ హ్యాండ్.. వాళ్లకు అంతా రేటు ఉంటుందా?
నిన్నటి ఎమ్మెల్యే వ్యవహారం కామెడీ సీన్ లాగా ఉందని అంతా డ్రామాయేనని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్నొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ నలుగురు సెకండ్ హ్యాండ్ ఎమ్మెల్యేలని, వాళ్లకు అంతా రేటు ఉంటుందా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఒక్కరూ గెలిచే వాళ్లు కాదన్నారు. నిన్నటి డ్రామాను ప్రజలు కాసేపు నవ్వుకున్నారన్నాఉ. నలుగురు తాగుబోతులను పెట్టి ప్రగతి భవన్ నుంచి డైరెక్షన్ ఇచ్చారని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఇచ్చి తీర్పు మునుగోడులో ఇస్తారన్నారు. దక్షిణ తెలంగాణ లో బీజేపీ విజృంభిస్తోందని కేసీఆర్కు నిద్ర పట్టడం లేదన్నారు. దేశంలో ఎక్కడా సిట్టింగ్ పార్టీ ఎమ్మెల్మేను బీజేపీ తీసుకోలేదన్నారు. బీజేపీలోకి వచ్చే ఎమ్యెల్యేలు పదవికి రాజీనామా చేశాక గెలుస్తారనే నమ్మకం ఉంటేనే పార్టీలోకి తీసుకుంటామని అరవింద్ పేర్కొన్నారు.













