ఎన్నారై వివాహంపై జాగ్రత్త : డీజీపీ
ఎన్నారై వివాహం విషయంలో మహిళలు జాగ్రత్తగా వ్యవహరించాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. నకిలీ ఎన్నారైల పట్ల ఎంతమాత్రం సున్నితంగా ఉండరాదని అన్నారు. ఎవరైనా మహిళలు ఎన్నారై భర్త చేతిలో, వారి కుటుంబసభ్యుల చేతిలో వేధింపులకు గురైతే వారికి న్యాయం చేకూరేలా అండగా నిలిచేందుకు ఎన్నారై ఉమెన్ సేఫ్టీ సెల్‌ను ఏర్పాటు చేశారు. సీఐడీలోని మహిళా భద్రత విభాగం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సెల్‌ను డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత మహిళలు తమ సమస్యను తెలిపేందుకు, వాటికి ఇక్కడి అధికారులు చట్టపరంగా పరిష్కారం చూపేందుకు ఎన్నారై ఉమెన్ సేఫ్టీ సెల్ ఒక వేదిక అవుతుందన్నారు. ఈ సందర్భంగా ఎన్నారైతో వివాహం కుదుర్చుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్‌ను డీజీపీ మహేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పాస్‌పోర్టు రిజినల్ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, తెలంగాణ స్టేట్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ వైజయంతి, మహిళ కమిషన్ మాజీ చైర్పర్సన్ త్రిపురనేని వెంకటరత్నం, 14 దేశాల ఎంబసీల ప్రతినిధులు, విదేశీ మంత్రిత్వశాఖ, పలు మహిళాపోలీస్స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు పాల్గొన్నారు.













