ప్రజా సమస్యల పరిష్కారం కోసమే… తెలంగాణలో

ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో రూ.20.50కోట్లతో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గతంలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశాను. గత ఏడాది మార్చి 16న పిప్పిరి నుంచే పీపుల్స్ మార్చ్ ప్రారంభించాను. ఈ ఏడాది మార్చి 16న ఇక్కడే సభ పెట్టాలకున్నాం. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఇవాళ జరిగే సభకు చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడి ప్రజల ఆశీర్వాదం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిరది. నియోజకవర్గంలో 3,500 ఇళ్లకు తగ్గకుండా ఏడాదిలో 4.50 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం. ఆరోగ్యశ్రీ కింద ఇచ్చే మొత్తాన్ని రూ. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం అని అన్నారు.