ప్రజలకు ఇబ్బందులు లేకుండా.. పకడ్బందీగా అమలు : భట్టి

లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్ అమలుపై సచివాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఎల్‌ఆర్‌ఎస్ విధివిధానాల కసరత్తుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 39 లక్షల దరఖాస్తులు పెండిరగ్‌లో ఉన్నాయని, వీలైనంత వేగంగా పరిష్కరించాలన్నారు. జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని, సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకోవాలని సూచించారు.