ఆ పాపం బీఆర్‌ఎస్‌దే … భట్టి విక్రమార్క ఆరోపణ

మేడిగడ్డ ప్రాజెక్టుతో పాటు సుంకిశాల పాపం కూడా బీఆర్‌ఎస్‌దేనని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. వర్షాల దృష్ట్యా చేపట్టాల్సిన చర్యలపై హైదరాబాద్‌లోని టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులతో భట్టి సమీక్షించారు. పదోన్నతులపై ఉద్యోగులతో చర్చిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ ఆ నెపం వేరొకరి మీద వేయడం దారుణమని విమర్శించారు. నాసికరమైన కట్టడం, డిజైన్ లోపం కారణంగానే 2021లో బీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిందన్నారు. బీఆర్‌ఎస్ కాలం నాటి ప్రాజెక్టు డిజైన్లు లోపభూయిష్టంగా ఉన్నాయని ఆరోపించారు. కూలిపోయిన గోడలు కట్టి, మరొకరిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.