కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
లిక్కర్స్కాంకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదుల్ని ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కార్యాలయానికి రావాలంటూ ఈడీ తనకు పంపిన సమన్లను రద్దు చేయాలని కవిత ఈ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. మహిళలను దర్యాప్తు సంస్థల ఆఫీసుల్లో ఎలా ప్రశ్నిస్తారని? ఇంట్లోనే విచారించాలనే అంశంపై ఆమె కోర్టును ఆశ్రయించారు. పిటిషన్లో నళిని చిదంబరం కేసును సైతం ఆమె జత చేశారు. ఈ తరుణంలో విచారణ జరిపిన న్యాయస్థానం ప్రతివాదులకు కౌంటర్ ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ ఆరువారాలకు వాయిదా వేసింది.













