ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వేడి తెలంగాణలో కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తనపై బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కవిత బీజేపీ నేతలపై పరువునష్టం దావా వేశారు. తెలంగాణలోని 33 జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మజుందర్ సిస్రా చేసిన ఆరోపణలపై కవత సీరియస్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు, తనకు ఏ విధమైన సంబంధం లేదని స్పష్టం చేశారు. దీనిపై న్యాయస్థానంలో తేల్చుకుంటానన్నారు. ఏ విచారణకైనా తాను సిద్ధమని, దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని అన్నారు.













