తెలుగు రైతుబడి కి అరుదైన గౌరవం

డిజిటల్ మీడియా వేదికల ద్వారా రైతులకు సమగ్ర వ్యవసాయ సమాచారం అందజేస్తున్న తెలుగు రైతుబడికి అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐఐటీ ఢిల్లీ ఈ ఏడాదికి నిర్వహించే ఆంత్రోప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొని, ప్రసంగించాలని రైతుబడి సంస్థ స్థాపకుడు జూలకంటి రాజేందర్ రెడ్డిని ఆహ్వానం అందింది. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలలో యువతకు ఉన్న సరికొత్త అవకాశాలను చర్చించేందుకు రావాలని ఐఐఐటీ కోరింది. ఈ నెల 15, 16 తేదీలలో ఈ సదస్సు ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో జరుగనున్నది. దేశ, విదేశాల నుంచచి అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇటీవలే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ ఉత్తమ క్రియేటర్ల అవార్డు ల్లోనూ వ్యవసాయ చానెళ్ల క్యాటగిరీలో రైతుబడి అత్యధిక ఓట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది.