ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా అమలు : కేజ్రీవాల్
2024లో దేశం నుంచి బీజేపీని తరిమికొడదామని, బీజేపీ పాలనతో జనం విసిగిపోయారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ అన్ని దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని, సింగపూర్, జపాన్ కన్నా మనం ఎందుకు వెనుకబడి ఉన్నామన్నారు. బీజేపీ పాలనలో దేశ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కేసీఆర్ మాకు పెద్దన్నలాంటి వారు అని, వారికి మా మద్దతు ఉంటుందన్నారు. తెలంగాణలో కంటి వెలుగు కార్యక్రమం చాలా గొప్ప సంకల్పం అని, ఎవరికి కంటికి ఇబ్బంది వచ్చిన సీఎం కేసీఆర్ రెప్పలా కాపాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని ఢల్లీి, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామన్నారు. సమీకృత కలెక్టరేట్లు అనే కాన్సెప్ట్ చాలా మంచిదన్నారు. ఢిల్లీలోని ప్రతి గల్లిలో మొహల్లా క్లినిక్ ఉందని, కేసీఆర్ స్వయంగా వచ్చి మొహల్లా క్లినిక్లను చూశారన్నారు. అదే పథకాన్ని బస్తీ దవఖానాల పేరుతో అమలు చేశారన్నారు.













