10న దత్తాత్రేయ అలయ్ బలయ్
దసరా పండుగ అనంతరం ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జలవిహార్‌లో ఈ నెల 10వ తేదీన అలయ్ బలయ్‌ని నిర్వహించాలని నిర్ణయించి ఏర్పాట్లును ముమ్మరం చేశారు. బీజేపీ నేతగా బండారు దత్తాత్రేయ గడచిన 15 సంవత్సరాలుగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో ఎంతో మంది భాగస్థులయ్యారు. గడచిన ఏడాది దత్తాత్రేయ కుమారుడి ఆకస్మిక మరణంతో ఆలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. అయితే ఈసారి హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడంతో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించే విషయంలో కొంత సందిగ్ధత నెలకొన్నప్పటికీ యధావిధిగా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్రాల గవర్నర్లు, అన్ని రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నారు.













