అమెరికా నుంచి విద్యార్థులను రప్పించాలి
అమెరికా జైళ్లలో చిక్కుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులను విడిపించాలని కోరుతూ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా, ముఖ్యమంత్రి కేసీఆర్‌లకు ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ బహిరంగ లేఖ రాశారు. విద్యార్థులను కాపాడేందుకు అవసరమైతే ఇవాంక ట్రంప్ సహకారం తీసుకోవాలని కేసీఆర్‌ను కోరారు. ఫార్మింగ్టన్ వర్సిటీ నకిలీదని తెలియక, తరగతులకు హాజరుకాకుండా పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకోవచ్చన్న వర్సిటీ అధికారుల మాటలతో విద్యార్థులు మోసపోయారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమెరికాకు ఒక బృందాన్ని పంపి అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఆయన కోరారు.













