అంతర్జాతీయ ప్రయాణికులకు అలర్ట్.. వారి పాస్‌పోర్టును

అంతర్జాతీయ ప్రయాణాలు చేసే ముందు ప్రయాణికులు ఒకసారి తమ పాస్‌పోర్టును పరిశీలించుకోవాలని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే సమయానికి 6 నెలల లోపు పాస్‌పోర్టు గడువు ముగిసిపోతున్నట్లయితే దాన్ని పునరుద్ధరించుకోవాలని ఆయన సూచించారు. మైనర్ పాస్‌పోర్టులు 5 ఏళ్ల గడవుకే అందిస్తామని తల్లిదండ్రులతో పాటు మైనర్లు ప్రయాణం చేస్తున్నట్లుయితే వారి పాస్‌పోర్టులు ఒకసారి చూసుకోవాలని తెలిపారు. ఎక్కువ ప్రయాణాలు చేసే వారు జంబో పాస్‌పోర్టు ఎంచుకోవాలన్నారు. పాస్‌పోర్టు అపాయింట్మెంట్ను 3 సార్లు రీ షెడ్యూల్ చేసుకోవచ్చని, అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.











































































