Danam Nagender: ఉప ఎన్నిక వస్తే మళ్లీ విజయమే : దానం నాగేందర్
రాజీనామా అంశం, ఉప ఎన్నికల్లో పోటీ చేయడంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిమాయత్‌నగర్ (Himayatnagar) డివిజన్ కార్యకర్తలతో ఆయన సమావేశమై మాట్లాడారు. రాజీనామా (Resignation) చేసి ఉప ఎన్నికలకు వెళ్లేందుకు తనకు ధైర్యం ఉందని, అది కార్యకర్తల ద్వారా వచ్చిందని చెప్పారు. కార్యకర్తల అండతోనే ఆరు సార్లు ఎమ్మెల్యే (MLA)గా గెలిచినట్లు తెలిపారు. ఉప ఎన్నిక వస్తే మళ్లీ గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. సీఎం పదవికి గౌరవం ఇవ్వడం మరిచింది బీఆర్ఎస్ (BRS) నేతలే అని విమర్శించారు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో అగౌరవంగా మాట్లాడిరది ఆ పార్టీ వాళ్లేనని మండిపడ్డారు. విమర్శలు చేస్తే, ప్రతివిమర్శలూ ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.






