సూర్యాపేట లో కన్నుల పండుగగా దళిత బంధు మహోత్సవం
నియోజకవర్గ వ్యాప్తంగా 100 మంది లబ్దిదారులకు 10 లక్షల చొప్పున 10 కోట్ల రూపాయల ఆస్తులు పంపిణీ చేసిన సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారితో పాటు సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్.
దళితుల జీవితాల్లో నిజమైన వెలుగులు నిండాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.దళితులు తలెత్తుకుని బతకాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమన్నారు.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపిక చేసిన 100మంది దళిత బంధు లబ్దిదారులకు మంజూరు పత్రాలు, యూనిట్లను మంత్రి పంపిణీ చేశారు.అంతకు ముందు సుమారు 4 గంటల పాటు దళిత బంధు లబ్దిదారులతో ముఖా ముఖి నిర్వహించిన మంత్రి ,పధకం ద్వారా వారు ఏమి చేయబోతున్నారు.. వాటిల్లో లాభ నష్టాల గురించి చర్చించి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి రోజున దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఒక పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి రూ. 10 లక్షల నగదు బదిలీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
నేటి నుంచి దళితబంధు యూనిట్ల ద్వారా లబ్ధిదారులు సంపాదించుకునే ప్రతి పైసా వారిదేనని స్పష్టం చేశారు. దళితులు వ్యాపార వృద్ధి సాధించి, అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలవాలని సూచించారు. పార్టీలకు అతీతంగా ఈ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసి యూనిట్లను అందజేస్తున్నామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలకు కూడా ఈ పథకం కింద ఆర్థిక సాయం అందజేస్తున్నాం. ప్రజలు న్యాయం, ధర్మం వైపు నిలబడాలని కోరారు. విద్య, ఉద్యోగాల్లోనే కాకుండా ప్రభుత్వం ఇచ్చే లైసెన్స్‌లు, కాంట్రాక్ట్‌లలో సైతం దళితులకు రిజర్వేషన్లు కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు. దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ చేపడుతున్న పథకాలు, విధాన నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని తెలిపారు.
కొత్త బడ్జెట్ ప్రకారం నియోజకవర్గానికి రెండు వేల మందికి దళితబంధు పథకాన్ని అమలు చేస్తామన్నారు.
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.18,000 కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు. ఇలా సంవత్సరానికి కొంతమంది చొప్పున అందరికి దళితబంధు అమలు చేస్తామన్నారు. ఈ పథకం లబ్ధిదారులు తమకు వచ్చిన, నచ్చిన పని చేసుకోవచ్చని సూచించారు. దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా భరించడానికి సిద్ధంగా ఉందన్నారు. దేశంలో ఏ గ్రామంలో లో అయినా కల్యాణ లక్ష్మి, దళిత బంధు, 24 గంటల కరెంట్,రైతు బంధు, రైతు బీమా, వంటి పధకాలు అమలు అవుతున్నాయని ప్రశ్న వస్తే అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని సమాధానం వస్తుందన్నారు..ఇది సీఎం కేసీఆర్ కు తెలంగాణ సమాజం పట్ల ఉన్న విజన్ వల్లే సాధ్యపడింది తప్పా, మరెవ్వరికీ సాధ్యం కాదని మంత్రి అన్నారు.. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి తో పాటు ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.













