ఇలాంటి పథకాన్ని ఎక్కడా చూడలేదు.. ఎన్ఆర్ఐ దంపతులు
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు స్కీం గొప్ప పథకమని లండన్‌కు చెందిన ఎన్ఆర్ఐ దంపతులు సుమన్-సమంతా ఎలిజబెత్ కొనియాడారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్‌లో దళితబంధు యూనిట్లను రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అదే గ్రామానికి చెందిన ఇమ్మాన్యుయేల్ వేజీ కుమారుడు సుమంత్, తన భార్య సమంతా ఎలిజబెత్‌తో కలిసి హాజరయ్యారు. తాను ఏన్నో దేశాలు, భారత్‌లోని అనేక రాష్ట్రాలు తిరిగామని, కానీ దళిత బంధు వంటి పథకం ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు. ఈ పథకంతో ఎందరో పేదల బతుకుల్లో వెలుగులు విరజిమ్ముతాయని పేర్కొన్నారు. ఇంత గొప్ప పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు కృజత్ఞతలు తలిపారు.













