తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అని నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. బ్యాంక్ లింకేజీతో సంబంధం లేకుండా రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నియోజకవర్గంలో యూనిట్‌కు 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయమని సీఎం అధికారులకు తెలిపారు. లబ్దిదారుడు కోరుకున్న యూనిట్నే ఎంపిక చేయాలని సూచించారు. దళితబంధు అమలు వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. మార్చి నెలతో 100 శాతం గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేల సలహాతో లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. లబ్ధిదారుల జాబితాను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఆమోదించాలని సీఎం పేర్కొన్నారు.













