బలగం మొగిలయ్యకు దళితబంధు
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఎల్లవేళలా దళితులకు అండగా ఉంటుందని, ఇందుకు నిదర్శనమే బలగం సినిమాలో పాటలు పాడిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు దళిత బంధు పథకం కింద కారు పంపిణీ చేయడమేనని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బలగం సినిమాలో తమ పాట ద్వారా ప్రేక్షకులను మెప్పించిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు తెలంగాణ ప్రభుత్వం తరపున దళిత బంధు పథకం కింద రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కారును అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, సుంకె రవిశంకర్, జోగినపల్లి శ్రీనివాసరావు, బేడ బుడగ జంగాల జేఏసీ చైర్మన్ టి. జగదీశ్వర్, వైఎస్ చైర్మన్ చింతల యాదరిగితో పాటు తదితరులు పాల్గొన్నారు.













