దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో..
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దళితబంధు పథకాన్ని తీసుకువచ్చి, అమలు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలో దళితబంధు లబ్దిదారుల అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడుతూ సామాజిక మార్పు కోసమే దళిత బంధు పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. దళితులు కూడా సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశ్యంతో కార్యక్రమం ప్రారంభించారని తెలిపారు. దేశంలోని దళితలందరు ఇలాంటి కార్యక్రమం తమకు అమలు చేయాలని ఆయా రాష్ట్రాల్లో డిమాండ్ చేసే రోజు వస్తుందని అన్నారు. దళితులను ఉన్నత స్థాయిలో చూడాలన్నదే సీఎం కేసీఆర్ కల అని అన్నారు. ఈ సందర్భంగా పలువురు దళితబంధు లబ్ధిదారులతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముచ్చటించారు. దళితబంధు యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం దళితబంధు లబ్ధిదారులతో కలిసి సహఫంక్తి భోజనం చేశారు.













