టీఆర్ ఎస్ కు డీఎస్ గుడ్ బై!
రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ (డీఎస్) త్వరలోనే టీఆర్ఎస్ పార్టీని వీడనున్నట్లు సమచారం. అక్టోబరు 11న కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. అక్టోబరు 9న తర్వాత డీఎస్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. తన పుట్టిన రోజు సందర్భంగా నిజామాబాద్‌లో ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం వివిధ సంఘాలతో సమావేశమైన ఆయన, నిజామాబాద్ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. వారి వల్లే తాను ఇన్ని పదవులు చేపట్టానన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. తానెప్పుడూ సెక్యులర్‌గా పనిచేశానని తెలిపారు. ఏ పదవిలో ఉన్నా శాంతియుత వాతావరణం ఉండేలా చూసుకున్నానన్నారు.













