త్వరలో సొంత గూటికి చేరనున్న డీఎస్
సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ త్వరలో సొంతగూటికి వెళ్లనున్నారు. ఈ నెల 24న ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నట్లు వివ్వసనీయ సమాచారం. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా కాంగ్రెస్లో కీలకపాత్ర పోషించిన డిఎస్, రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ ఆహ్వానం మేరకు 2015లో టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన నిజామాబాద్ జిల్లాలో గ్రూపు తగాదాల వల్ల కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. సీఎం కేసీఆర్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన డిఎస్ మళ్లీ కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే డిఎస్ చేరికపై తమకు సమాచారం లేదని తెలంగాణ పీసీసీ నేతలు తెలిపారు.













