జాతీయ రహదారుల వెంబడి రంగు రంగుల పూల మొక్కలు నాటాలి: సీఎస్
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు, రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారుల వెంబడి రంగు రంగుల పూల మొక్కలతో ఆహ్లదకర వాతావరణం ఉట్టిపడెలా multi layer avenue plantation చేపట్టడానికి తగు ప్రణాళికలను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, ఆర్ & బి, మున్సిపాలిటీస్. ఓఆర్ ఆర్, పంచాయతీ రాజ్, NHAI రహదారుల వెంట మల్టీ లెవల్ ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టే విషయమై సంబంధిత అధికారులతో శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్లాంటేషన్ చేపట్టవలసిన రోడ్ల విస్తరణ, వివిధరకాల మొక్కలు నాటెందుకు నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు., సింగిల్ లేయర్ ప్లాంటేషన్ లో ప్రత్యేక మొక్కలు నాటాలని ఆయన సూచించారు. వివిధ శాఖల సమన్వయం తో జిల్లాలలో రహదారుల వెంబడి మల్టీ లెవల్ ప్లాంటేషన్ విస్తరణ వివరాలతో కూడిన నివేదికలను జిల్లాల వారిగా రూపొందించాలని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, పిసిసిఎఫ్ శ్రీమతి శోభ, పిసిసిఎఫ్ (SF) శ్రీ డోబ్రియల్, జి.హెచ్.యం.సి కమీషనర్ డిఎస్. లోకేశ్ కుమార్ , మున్సిపల్ శాఖ సంచాలకులు శ్రీ ఎన్. సత్యనారాయణ, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారిణి, శ్రీమతి ప్రియాంకవర్గీస్, RD స్పెషల్ కమీషనర్, శ్రీ వి.ఎస్.ఎన్.వి. ప్రసాద్, పంచాయతీ రాజ్ ఇంజనీర్ ఇన్ ఛీఫ్ శ్రీ సంజీవ్ రావు, రహదారులు, భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ ఛీఫ్ శ్రీ రవీందర్ రావు, జాతీయ రహదారుల విభాగం, జనరల్ మేనేజర్ శ్రీ నాగేశ్వర్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.













