దళితులకు గుడ్ న్యూస్… తెలంగాణ వ్యాప్తంగా
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు అద్భుతమైన పథకం, దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ కలెక్టరేట్లో దళితబంధుపై సీఎస్ సోమేశ్ కుమార్, ఎస్సీ అభివృద్ధి శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా, కలెక్టర్ కర్ణన్ కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఈ పథకం కింద ప్రతీ లబ్దిదారుడికి రూ.10 లక్షల చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఫైలట్ ప్రాజెక్టు కింద ముందుగా హుజూరాబాద్‌లో అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 16న జరిగే సభలో 15 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ చెక్కులు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం. గ్రామ సభల ద్వారా దళిత బంధు సాయాన్ని పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని సీఎస్ స్పష్టం చేశారు.













