గ్రామ స్వరాజానికి ఇది ప్రాణం : సీఎస్ సోమేశ్ కుమార్
దేశంలోనే పల్లె ప్రగతి పథకం అద్భుత ఆవిష్కరణ అని, గ్రామ స్వరాజానికి ఇది ప్రాణం పోసిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలురు గౌరీ శంకర్ బీఆర్కే భవన్లో సోమేశ్ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జూలూరు గౌరీ శంకర్ రచించిన పచ్చా పచ్ఛాని పల్లె అనే పుస్తకాన్ని సీఎస్ సోమేశ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సంద్భంగా సీఎస్ మాట్లాడుతూ పల్లె ప్రగతితో పలెల్ల ముఖ చిత్రం మారిపోయిందని అన్నారు. పల్లెల ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని స్వచ్ఛ భారత్‌లో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రతీ పల్లె సర్వ స్వతంత్ర కేంద్రంగా నిలవడానికి ముఖ్యమంత్రి దార్శనిక ఆలోచనా ఎంతో దోహదం చేసిందన్నారు. స్ఫూర్తి దాయక పుస్తకాన్ని రచించిన జూలూరీ గౌరీ శంకర్‌ను సీఎస్ అభినందించారు.













