సీఎస్ శాంతి కుమారి కీలక సమావేశం

హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ సీఎస్ శాంతి కుమారి కీలక సమావేశం నిర్వహించారు. కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో అధికారులతో ఆమె సమావేశమయ్యారు. నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని హైడ్రాకు ఇటీవల ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ క్రమంలో వివిధ అంశాలపై చర్చించేందుకు హైడ్రా, జీహెచ్‌ఏంసీ, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సీఎస్ భేటీ అయ్యారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ సమావేశానికి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.