22వ తేదీ నాటికి టార్గెట్ పూర్తి చేయాలి : సీఎస్
తెలంగాణ రాష్ట్రంలో అర్హత గల వారందరికీ వ్యాక్సిన్ అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఈ నెల 22వ తేదీ నాటికి టార్గెట్ లను సాధించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్య, పంచాయితీ అధికారులు, మున్సిపల్ కమిషనర్ లతో వ్యాక్సినేషన్ పై జిల్లాల వారీగా నోడల్ అధికారులను నియమించి కరోనా టీకా తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా గ్రామాల ప్రజలను చైతన్యం చేస్తూ వ్యాక్సిన్ అందించే బాధ్యతలను అప్పగించాలన్నారు. అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో వార్డుల వారీగా మెప్మా రీసోర్స్ పర్సన్లను, వైద్య సిబ్బందికి బాధ్యతలు అప్పగిస్తూ అర్హత గల వారందరికీ వ్యాక్సిన్ అందించాలని అన్నారు.













