నిజామాబాదు ఐటీ హబ్ లో USA కంపెనీ క్రిటికల్ రివర్ సంస్థ ఏర్పాటుకు సుముఖత: మహేష్ బిగాల
ఐటీ మినిస్టర్ కేటీర్ గారు అమెరికా లో పర్యటిస్తున్నారు,ఈ పర్యటనలో భాగంగా అమెరికాలోని వివిధ రాష్ట్రాల లో వున్నా దిగ్గజాలను కలుస్తున్నారు.ఆయనతో పాటు మహేష్ బిగాల నిజామాబాదు ఇట్ హబ్ ని ప్రమోట్ చేసే భాగంగా క్రిటికల్ రివర్ కంపెనీ ప్రతినిధులను కలిశారు.
మహేష్ బిగాల మాట్లాడుతూ ఇప్పటికే క్రిటికల్ రివర్ కంపెనీ ప్రతినిధులు నిజామాబాదు ఐటీ హబ్ లో స్థానిక ఎమ్మెల్లే గణేష్ బిగాల గారితో గతములో పర్యటించారు , ప్రస్తుతం అమెరికా పర్యటనలో వున్నా కేటీర్ గారితో క్రిటికల్ రివర్ కంపెనీ ప్రతినిధులు ఫౌండర్ అంజి మారం భేటీ అయ్యారు, ఈ భేటీలో వారు రాబోయే రోజుల్లో నిజామాబాదు ఐటీ హబ్ లో కంపెనీ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసారు, నిజామాబాదు లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు కనెక్టివిటీ అన్ని రకాలుగా సదుపాయాలు ఉన్నాయని అందుకు రాబోపై రోజుల్లో వారి సంస్థ అక్కడ ఒక బ్రాంచ్ పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసారు అలాగే ప్రస్తుతం కాలిఫోర్నియా , హైదరాబాద్ మరియు విజయవాడ లో కలిసి 1000 మంది ఉద్యోగులతో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంది అన్నారు.
నిజామాబాదు ఐటీ హబ్ లో ప్రస్తుతం ఐటీ దిగ్గజ సంస్థలు కార్యకలాపాలు మొదలు పెట్టాయి, నిజామాబాదు కి ఐటీ రంగం కి వివిధ సంస్థల నుంచి అవకాశాలని తీసుకు వస్తున్న మహేష్ బిగాల గారిని కేటీర్ గారు అభినందించారు, మంత్రి కేటీర్ గారితో భేటీలో ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఎన్నారై & జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (TSTPC) విష్ణు వర్ధన్ రెడ్డి, గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల తో పాటు క్రిటికల్ కేర్ ఫౌండర్ అంజి మారం పాల్గొన్నారు.













