బీజేపీని ఓడించే పార్టీ ఏది ఉంటే.. దానికే మా మద్దతు
టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చే అంశం కేవలం మనుగోడుకే పరిమితం కాబోదని, భవిష్యత్తులోనూ టీఆర్ఎస్తో కలిసి నడుస్తామని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు బహిరంగ మద్దతు ప్రకటించారు. బీజేపీని ఓడించే పార్టీ ఏది ఉంటే దానికే మా మద్దతు. ఉప ఎన్నికల్లో సీపీఐ నిలబడే పరిస్థితి లేదు. బీజేపీని ఓడించే సత్తా ఒక్క టీఆర్ఎస్కే ఉంది. అందుకే ఆ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నాం. టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చినంతా మాత్రాన ప్రజల సమస్యలపై మార పోరాటం ఆగదన్నారు. ఇది మునుగోడుకే పరిమితం కాదు. భవిష్యత్లో కూడా టీఆర్ఎస్తో పనిచేస్తాం అని స్పష్టం చేశారు. మునుగోడు బహిరంగ సభకు రావాలని కేసీఆర్ ఆహ్వానించారని, అందుకే సీసీఐ నేతలు వెళ్తున్నారని తెలిపారు.













