ఈ ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణం
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మధ్యాహ్న బోజనం వికటించి 600 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. క్యాంపస్‌లో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు ఆందోళన చేపట్టినప్పటికీ పరిస్థితులు మారలేదన్నారు. సమస్యల పరిష్కారంకోసం ప్రభుత్వం 5 కోట్లు ఇచ్చినప్పటికీ విద్యార్థుల మెస్ మారలేదని అన్నారు. కాంట్రాక్టర్లు పాతవారే ఉన్నారని, విద్యార్థులకు ఇస్తున్న ఆహారం మారలేదన్నారు. విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడూ అవే పరిస్థితులు ఉన్నాయన్నారు. కేవలం వెయ్యి మంది విద్యార్థులకు పాత ల్యాప్‌టాప్‌లు ఇచ్చారన్నారు. మెస్‌ను యాజమాన్యమే నిర్వహిస్తే ఈ సమస్య వచ్చేది కాదన్నారు. ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వడంతో వారు నాసికరం ఆహారం పంపిణీ చేశారని ఆరోపించారు. ఈ ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.













