ఆ కుటుంబానికి గొప్ప రాజకీయ చరిత్ర.. అమిత్ షా కలవడమేమిటి?
సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి గొప్ప రాజకీయ చరిత్ర ఉందని, ఆయనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. హైదరాబాద్లో ఎంబీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిహార్ సీఎం నితీశ్ కుమార్ను కలవడం మంచి పరిణామమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కూడా బీజేపీ వ్యతిరేక కూటమిలో చేర్చుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణలో సినీ నటులను బీజేపీ ప్రసన్నం చేసుకుంటోందని, వారి ద్వారా టీఆర్ఎస్ బలహీన పరచాలని చూస్తోందని వ్యాఖ్యానించారు.













