మహిళా దర్బార్ ను రద్దు చేయాలి… సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తలపెట్టిన మహిళా దర్బార్ కార్యక్రమంపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై లక్ష్మణరేఖ దాటుతున్నారని వ్యాఖ్యానించారు. మహిళా దర్బార్ అసలెందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఓవైపు బీజేపీ రాజకీయ దాడిని పెంచిందని, మరోవైపు గవర్నర్ పాత్ర అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లుగా ఉందన్నారు. మహిళా దర్బార్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విధానపరంగా సీపీఐ పోరాడుతోందని స్పష్టం చేశారు. మైనర్లను పబ్‌లోకి అనుమతించడం చట్టరీత్యా నేరమని, పబ్‌ను సీజ్ చేసి యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.













