మోదీకి అనుకూలంగా ఈసీ పనిచేస్తోంది: సీబీఐ నారాయణ

మోదీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అనుకూలంగా పనిచేస్తోందని, ఈవీఎంలపై అందరికీ అనుమానాలున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. అందుకే ఎలాంటి తప్పులూ జరగకుండా ఉండాలంటే బూత్‌ల వారీగా ఓటింగ్ లెక్కలు ఉండాల్సిందేనని డిమాండ్ చేశారు. శనివారం నాడు ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించిన నారాయణ.. దేశంలో బీజేపీ పాలన అంతం కాబోతోందని, మోదీ నియంతృత్వ పరిపాలన అంతమయ్యే సమయం ఆసన్నమైందని, బీజేపీ ఈ దఫా ఎన్నికల్లో 200 మార్క్ దాటే అవకాశం లేదని జోస్యం చెప్పారు. “మోదీ సర్కార్‌కు అనుకూలంగా ఈసీ పనిచేస్తోంది. ఈవీఎంలపై కూడా అనేక అనుమానాలున్నాయి. అందుకే బూత్‌ల వారీగా ఓటింగ్ లెక్కలు బహిర్గతం చేస్తేనే అసలు విజేతలెవరో తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వస్తాయి. కేంద్రంలో అధికారంలోకి రాబోయేది ఇండియా కూటమే’’ అంటూ నారాయణ జోస్యం చెప్పారు.