కేసీఆర్ కుమార్తెను కాపాడేది బీజేపీ కాదా? : నారాయణ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెను కాపాడేది బీజేపీ ప్రభుత్వం కాదా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్పై ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు ఆత్మసుత్తి పరనిందలా ఉన్నాయని విమర్శించారు. మద్యం కుంభకోణంలో రాజీ ఒప్పందం కుదిరిన తర్వాతనే వైసీపీ, కేసీఆర్, బీజేపీ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు. అందుకే మనీశ్ సిసోదియాను జైల్లో పెట్టారని మండిపడ్డారు. అందరూ కలిసి కుమ్మక్కై సిసోదియాను మాత్రమే ఇరికించారన్నారు. సత్యం రామలింగరాజు మీద సెబీ ఎంక్వెయిరీ వేశారని, అదానీ కుంభకోణంలో ఎందుకు సెబీ ఎంక్వెయిరీ వేయలేదని ప్రశ్నించారు. పెద్ద కుంభకోణం బయట పెడితే ఆయనను కాపాడుకుంటున్నారని విమర్శించారు.













