కొన్ని అంశాల్లో వ్యతిరేకించినా… మిగతా విధానాల్లో కలిసి పనిచేస్తాం
కొన్ని అంశాల్లో సీఎం కేసీఆర్ను వ్యతిరేకిస్తునప్పటికీ, మిగతా విధానాల్లో కలిసి పని చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం పేరుతో దేశంలో అధ్యక్ష తరహా పాలన తీసుకురావాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించే వారిని అణగదొక్కుతున్నారని, దర్యాప్తు సంస్థలను రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ విధానాలు వ్యతిరేకిస్తూ ఏర్పాటైన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమన్నారు. పరిశ్రమ ఏర్పాటు చేయడం చేతకాకపోతే కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.













