సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలమల్లేశ్ మృతి

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.బాలమల్లేశ్ యాదవ్ కన్ను మూశారు. ఏఎస్‌రావు నగర్‌లోని పౌలోమీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని యాప్రాల్‌లోని నివాసానికి తరలించారు. ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో బాలమల్లేశ్ పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు సీపీఐ నేతలు సంతాపం తెలిపారు.