శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కరోనా కలకలం..
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కరోనా కలకలం సృష్టించింది. పలు దేశాల నుంచి వచ్చిన విదేశీ ప్రయాణికుల్లో 11 మంది కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా కరోనా బారినపడ్డనట్లు గుర్తించారు. దీంతో అధికారులు వారిని గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించి, చికిత్సలు అందిస్తున్నారు. 11 మంది ప్రయాణికుల్లో యూకే నుంచి తొమ్మిది మంది, సింగపూర్, కెనడా, అమెరికా నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. కరోనా పాజిటివ్‌గా తేలిన ప్రయాణికుల నమూనాలను సేకరించిన జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు.













