కవితకు కోర్టులో మళ్లీ చుక్కెదురు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలుగా అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈరోజు కోర్టులో తీవ్ర నిరాశ ఎదురయింది. ప్రస్తుతం తీహార్ జైల్‌లో ఉంటున్న కవితను బయటకు తీసుకురావడానికి ఆమె కుటుంబం ఎంతో తాపత్రయ పడుతున్నారు. తన చిన్న కొడుకు ఎగ్జాం ప్రిపరేషన్ కోసం కవిత కోర్టులో బెయిల్ కి అప్లై చేయడం జరిగింది. కానీ కవిత బయటకు వెళ్లిన మరుక్షణం సాక్షాలను ప్రభావితం చేసి మార్చే అవకాశం ఉంది అన్న ఈడీ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆమెకు బెయిల్ నిరాకరించింది. ఇప్పటికే కవిత కొందరిని బెదిరించినట్టుగా ఈడి కోర్టుకు తెలియజేసింది. హైదరాబాదులోని కవిత నివాసంలో మార్చి 15వ తారీఖున ఈడీ ఆమె కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత కోర్టు అనుమతితో ఆమెను విచారించిన తర్వాత మార్చి 26న తీహార్ జైలుకు మార్చారు.