ఏప్రిల్ 14 వరకు కోర్టులకు లాక్డౌన్
హైకోర్టు సహా, హైకోర్టు ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని కింది కోర్టులు, ట్రైబ్యునళ్లు, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, మధ్యవర్తిత్వ కేంద్రాలు, హైకోర్టు న్యాయసేవాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర జ్యూడిషియల్ అకాడమీ అన్నీ తక్షణం మూసివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 14, లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేదాక ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది. ఏప్రిల్ 14 వరకు లిస్ట్ అయిన కేసులన్నీ నెల తరువాత కోర్టు ప్రారంభమయ్యే రోజుకు వాయిదా పడతాయని, వీటిని జిల్లా కోర్టుల వెబ్సైట్లో పెట్టనున్నట్లు పేర్కొంది. న్యాయ పక్రియలో భాగంగా అవసరమైన కొంత మంది మినహా మిగిలిన సిబ్బంది కార్యాలయాలకు హాజరుకావసరం లేదని, అవసరమైనపుడు హాజరుకావడానికి వీలుగా ఫోన్లో అందుబాటులో ఉండాలని సూచించింది. న్యాయవాదులు, కక్షిదారులు ఎవరు వ్యక్తిగతంగా ఈ కోర్టుతో సహా ఏ కోర్టుకూ హాజరుకానవసరం లేదని పేర్కొంది.













