మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కూడా కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపారు. కరోనా లక్షణాలు కొన్ని మాత్రమే ఉన్నాయన్నారు. టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. నేను ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని చెప్పారు. తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉంటూ, కోవిడ్ ప్రోటోకాల్ పాటించి టెస్టు చేయించుకుని ఉండండి అని సూచించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. గురువారం ఎంపీ సంతోష్ రావుకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.













