తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు బాగా తగ్గాయి. 24 గంటల్లో 1,12,982 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 993 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో కరోనాతో 9 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,644కు చేరింది. 24 గంటల్లో 1,417 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,869 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్‍ఎంసీలో 124 పాజిటివ్ కేసులు నమోదు కాగా, నల్గొండలో 78, సూర్యాపేటలో 72, మంచిర్యాలలో 59, భదాద్రి కొత్తగూడెంలో 58, ఖమ్మంలో 50, మహబూబాబాద్‍లో 51 కేసులు నమోదయ్యాయి.