తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గుముఖం..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో 1,18,427 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 1,028 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కరోనాతో 9 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు 3,627 మంది మరణించారు. 24 గంటల్లో 1,489 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15,054 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6.19 లక్షల మందికి కరోనా నిర్ధారణ కాగా, 6.01 లక్షల మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు.