తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఈసారి కూడా…

కరోనా విజృంభణ, లాక్‍డౌన్ పరిస్థితుల కారణంగా ఈసారి జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకునే అవకాశం లేదు. లాక్‍డౌన్ పొడిగింపు అవకాశాలపై అధికార యంత్రాంగంలో విస్తృత చర్చ సాగుతోంది. కరోనా మహమ్మారి కోరలు చాస్తోన్న ప్రస్తుత తరుణంలో కార్యక్రమ నిర్వహణ కష్టమేనని టీఆర్‍ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు.