పాస్ పోర్టు కార్యాలయాన్ని సందర్శించిన కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా
హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాన్ని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా యూఎస్ఏ శాన్ఫ్రాన్సిస్కో డాక్టర్ కె.శ్రీకర్ రెడ్డి సందర్శించారు. డాక్టర్ శ్రీకర్‌రెడ్డి హైదరాబాద్ ఆర్పీఓలో 2011 జులై నుంచి ఆగస్టు 2014 వరకు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారిగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆర్పీఓ బాలయ్య శ్రీకర్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి దరఖాస్తుదారులకు సులభంగా పాస్‌పోర్టు చేరవేయడంలో శ్రీకర్‌రెడ్డి ముఖ్య భూమిక పోషించారని దాసరి బాలయ్య కొనియాడారు. వాణిజ్య మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా, మారిషస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో ఇటీవల ముగిసిన స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల కోసం భారత ప్రధాన సంధానకర్తగా విజయవంతంగా పనిచేశారన్నారు. ప్రజలకు పాస్‌పోర్టులను అందించడంలో హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయ అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషిని ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకర్ రెడ్డి ప్రశంసించారు. ఈ సంవత్సర ప్రథమార్థం లో 4 లక్షల పాస్‌పోర్టులను జారీ చేయడాన్ని ఆయన అభినందించారు.













