ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రద్దు చేయాలి
తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ నేత దాసోజు శ్రవణ్ కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌పై పలు అభ్యంతరాలను తెలిపారు. అర్థరాత్రి షెడ్యూల్ ఇచ్చి తెల్లవారు జామునుంచే నామినేషన్ స్వీకరించడమేంటని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని సీఈసీని కోరినట్టు ఆయన తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎన్నికల్లో ఓటేసేందుకు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ ఫిర్యాదు నేపథ్యంలో అన్ని విషయాలూ పరిశీలిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ హామీ ఇచ్చిందని శ్రవణ్ తెలిపారు.













