నిరసన హక్కు కరువు
సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామ దళితులపై జరిగిన పోలీసు దమనకాండను నిరసిస్తూ రాష్ట్ర వ్యాపితంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీలు, రాస్తారోకో, బైఠాయింపులతో హోరెత్తిపోయిం ది. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను నిరసించే హక్కును రాష్ట్రం కోల్పోయిందని సిఎల్పి నేత జానారెడ్డి మండిపడ్డారు. నేరెళ్ల గ్రామ దళితుల పై పోలీసుల దమనకాండను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట బుధవారం చేపట్టిప ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. థర్డ్ డిగ్రీ పద్ధతులను ఉపయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభు త్వం వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.













