కాంగ్రెస్ లోకి పోచారం.. కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే

మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పోచారం ఇటీవల బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి కూడా ఢిల్లీకి చేరుకున్నారు. తన కుమారుడు భాస్కర్ రెడ్డితో కలిసి ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో ఖర్గేను కలిశారు. ఈ కార్యక్రమంలో రాహుల్, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ కూడా పాల్గొన్నారు.