కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి సంచలన ప్రకటన….
నాగార్జునసాగర్‌లో జానారెడ్డి గెలుపు ఖాయమని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జోస్యం చెప్పారు. నాగార్జున సాగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే రాజకీయాల గురించి మాట్లాడనని కోమటిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. సాగర్ ఉప ఎన్నిక కోసమే కేసీఆర్ నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. ఐకేపీ సెంటర్లను మూసివేస్తే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను రైతులు ఉరికించి కొడతారన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా కేరళ తరహాలో అసెంబ్లీ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అవినీతిపై బీజేపీ పార్టీ రాజీపడ్డా తాము మాత్రం కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. యాదగిరిగుట్టలో నిర్వాసితులకు ఎందుకు పరిహారం ఇవ్వడం లేదంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు. మూడేళ్ళుగా డీఎస్పీ నోటిఫికేషన్ లేక వేల స్కూళ్లు మూతపడ్డాయన్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆత్మహత్యలకు కారణం కేసీఆర్ కాదా అంటూ కేసీఆర్ ప్రభుత్వానికి కోమటిరెడ్డి ప్రశ్నించారు.













