రెగ్యులరైజ్ చేయలేదు.. విలీనం చేశాం: కేసీఆర్
ఇండియాలో ఏ రాష్ట్రంలో లేని పరిస్థితులు తెలంగాణ లో ఉన్నాయన్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ నేతలు అధికారం వస్తాదని భావించి భంగపడ్డారని.. వాళ్ళు వ్యవహరించిన తీరుకు ప్రజలు వాళ్లను తిరస్కరించారన్నారు. ఎక్కడా లేని కేసులు పెడుతున్నారన్నారు. ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడుతూ… “సాగునీటి ప్రాజెక్టులపై 164 కేసులు వేశారు. కాంగ్రెస్ పార్టీవి అన్ని చిల్లర, దివాలా కోరు రాజకీయాలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 20 రోజుల్లో 6 కేసులు వేశారు. ప్రతిపక్ష పార్టీ వైఖరి ఇదా.. వీళ్లకు రాజకీయం కూడా రావడం లేదు. నాకు జాలి కలుగుతోంది. చంద్రబాబు పుణ్యమాని కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ వచ్చింది. దాన్ని కాంగ్రెస్ కొనసాగించింది. హోం గార్డుల జీతం 3 వేలు 4 వేలు ఉండేది.. దాన్ని 12వేలకు తెచ్చాము. విద్యుత్ సంస్థల్లో పనిచేసే వాళ్ళు పరిస్థితి దారుణంగా ఉంది. మేము వాళ్ళను రెగ్యులర్ చేయలేదు. సంస్థ పరిధిలోకి తీసుకు వచ్చాము. ఉద్యోగులను విలీనం చేశామన్నారు. మేము కోర్టుకు అప్పీల్ కు వెళ్తున్నాము. కోర్ట్ ఇచ్చిన తీర్పు కంటే…మేము వారికి జీతాలు ఎక్కువ ఇస్తాము. వెయ్యి రూపాయలు ఇస్తాం. కోర్టు దళారులు వేసిన కేసు కొట్టివేసింది. దీనికి నా ధన్యవాదాలు. కాంట్రాక్టు ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూస్తాం. మనస్సు చిన్నబుచ్చు కోవద్దు. అందరికీ సాయం చేస్తాం. మేలు చేసేలా చేస్తాం.. దయచేసి జర్నలిస్టులు కూడా కాంగ్రెస్ ను ఎండగట్టాలి.”













