గల్ఫ్ కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం : ఎన్నారై సెల్ కన్వీనర్ ఎజాజ్

గల్ఫ్ కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్వేయమని తెలంగాణ పీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ డాక్టర్ ముహమ్మద్ ఎజాజ్ ఉజ్ జమా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గల్ఫ్‌లో తెలంగాణకు చెందిన కార్మికులు మృతి చెందితే వారి కటుంబాలను ఆదుకునేందుకు, గతంలో ఏ ప్రభుత్వాలు చేపట్టని నిర్ణయం సీఎం రేవంత్ తీసుకోవడం ఎంతో సాహసోపేతమన్నారు. జీవో 205 అమలుతో గల్ఫ్ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిన ఘనత చరిత్రలో మరే ప్రభుత్వానికి దక్కలేదన్నారు. ఈ జీవో గల్ప్ బాధిత కుటుంబాలను ఆదుకోవడంతో సహామానత్వాన్ని చాటుతోందని కొనియాడారు. దీంతో గల్ఫ్‌లోని బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లలో ఉద్యోగాలు చేస్తున్న తెలంగాణ చెందిన బాధిత కుటుంబాలకు మేలు కలుగుతోందని ఆయన పేర్కొన్నారు.